ప్రపంచ కప్ 2015 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. ఆదివారం నాడు (15వ తేదీన) పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఈ నేపథ్యంలో మోడీ స్వయంగా నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసినట్లు విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. క్రికెట్ గురించి వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఒకరి జట్టుకు మరొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారన్నారు. 1992లో పాకిస్తాన్ కప్పు గెలవడాన్ని మోడీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు ప్రారంభించాలని షరీఫ్ కోరారు. త్వరలో జరిగే కామన్వెల్త్ దేశాల సమావేశానికి కార్యదర్శులను పంపుదామని, అక్కడ వారు తాజా పరిస్థితులను చర్చిస్తారని మోడీ చెప్పారని తెలుస్తోంది.
Post Top Ad
Your Ad Spot
Monday, 16 March 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment