తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కేజీ టు పీజీని పటిష్టంగా అమలు పరచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా మన్నారు. దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా పాలసీని రూపొందిస్తామని చెప్పారు. శాసనసభలో శనివారం సభ్యులు కే లక్ష్మణ్, జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ కేజీ టు పీజీ విషయమై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘా లతో చర్చించి అమలుచేస్తామన్నారు. ఈ పాలసీని అసెంబ్లీలో సైతం చర్చకు పెడతామని చెప్పారు. నాణ్యతతో కూడిన ఉచిత విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా కామన్ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వ, ప్రవేటు రంగంలో 43,861 పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 59,54,376 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. కాగా మరో 46 వేల మంది పిల్లలు బడి బయట ఉన్నారన్నారు. వీరందరకూ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యా హక్కు చట్టం విష యమై కమిటీని వేశామని, ఇది నివేదికను సమర్పించగానే దానిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలు ఉన్న చోట్ల విద్యార్థులు లేరని, విద్యా ర్థులు ఉన్న చోట సరిపడా ఉపాధ్యాయలు లేరని ఇటువంటి లోపాలను సరిచే స్తామన వెల్లడించారు. దేశానికే ఆదర్శవంతమైన విద్యా పాలసీని అందించా లన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి కడియం తెలిపారు. అలాగే పువ్వాడ అజయ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఎమ్‌సెట్ ఉమ్మడిగా నిర్వహించాలనేది ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో లేదని తేల్చిచె ప్పారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎంసెట్‌ను నిర్వహి స్తున్నామని చెప్పారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్డ్‌లో ఉన్న సంస్థలను మాత్రమే ఉమ్మడిగా నిర్వహించుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంసె ట్ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఎంసెట్ నిర్వహణ, ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల ఎంపికకు ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి పేర్కొన్నారు.
Post Top Ad
Your Ad Spot
Monday, 16 March 2015
కేజీ టు పీజీని నీరుగార్చే ప్రసేక్త లేదు
Tags
# News
# Telangana News
Telangana News
Labels:
News,
Telangana News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment