నిస్సహాయత వ్యక్తం చేసిన సుప్రీం న్యూఢిల్లీ : భారత్‌లో అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించేందుకు తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తి తన గదిలో కూర్చుని అశ్లీల చిత్రాలు చూడాలనుకునే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాధమిక హక్కును ఎవరూ నిలువరించలేరని నిస్సహాయత వ్యక్తంచేసింది. ''అటువంటి తాత్కాలిక ఆదేశాలను ఈ కోర్టు జారీ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టుకు వచ్చి మైనారిటీ తీరిన వ్యక్తిని నేను, నా గదిలో కూర్చుని నేను చూస్తుంటే మీరెలా నన్ను నిలువరించగలుగుతారు. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని ప్రశ్నించవచ్చని'' ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు మౌఖికంగా తెలిపారు. న్యాయవాది కమలేష్ వాష్వాని వేసిన పిటిషన్‌పై విచారించిన ప్రధాన న్యాయమూర్తి పై విధంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదని అందువల్ల కోర్టు కల్పించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మరిన్ని సంబందిత వార్తలు
Post Top Ad
Your Ad Spot
Saturday, 11 July 2015
అశ్లీల వెబ్‌సైట్లను నిరోధించలేం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment