ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ ఫండ్(ఎన్‌పీఎస్‌ఎఫ్) భారత జనాభా నివేదికను విడుదల చేసింది. ఎన్‌పీఎస్‌ఎఫ్ నివేదిక ప్రకారం జులై 11 సాయంత్రం 5 గంటలకు భారత జనాభా 127,42,39,769కు చేరింది. ఇది ప్రపంచ జనాభాలో 17.25 శాతం.* ఏడాదికి 1.6శాతం చొప్పున మనదేశంలో జనాభా పెరుగుతోంది.* ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారత్ జనాభా 163కోట్లను దాటి అత్యధిక జనాభాతో ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలవనుంది.* ప్రస్తుతం చైనా 137 కోట్లకుపైగా జనాభాతో మొదటిస్థానంలో ఉంది.* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా 121కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్‌లాంటి దేశాల జనాభా అంతా కలిపితే భారత జనాభాకు సరిసమానం
Post Top Ad
Your Ad Spot
Saturday, 11 July 2015
127,42,39,769.. ఇది ప్రస్తుత భారత జనాభా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment