కార్గిల్ విజయానికి పదహారేండ్లు - TS TRT

Post Top Ad

Your Ad Spot

Sunday, 26 July 2015

కార్గిల్ విజయానికి పదహారేండ్లు


kaargil vijayaaniki padahaarendlu


వీర సైనికులకు రక్షణమంత్రి పారికర్,త్రివిధ దళాధిపతుల నివాళులు -అమర్‌జవాన్ జ్యోతి వద్ద ఘనంగా విజయ్‌దివస్ -దేశవ్యాప్తంగా, సైనిక కేంద్రాల్లో విజయోత్సవాలు -నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు కార్గిల్ విజయానికి పదహారేండ్లు.. సరిహద్దుల్లోని ఎత్తైన మంచు పర్వతాలను రక్షణగా చేసుకుని దాడికి దిగిన శత్రువులతో వీరోచితంగా పోరాడి సరిహద్దుల అవతలికి తరమికొట్టిన సైనికుల త్యాగాలను తలుచుకుంటూ దేశం ఘనంగా విజయదివస్ జరుపుకొన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని అమర్‌జవాన్ జ్యోతి వద్ద రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా, నేవీ వైస్ చీఫ్ పీ మురుగేశన్ వీర సైనికులకు నివాళులు అర్పించారు. ఈ విజయాన్మి స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ముఖ్యంగా అన్ని సైనిక కేంద్రాల్లో కార్గిల్ యుద్ధం లో మృతిచెందిన 490మందికిపైగా వీర సైనికులకు నివాళులు అర్పించారు. మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ కార్గిల్ వీర సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. వారి సేవలకు దేశం సెల్యూట్ చేస్తున్నదన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ సుహాగ్ కశ్మీర్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఏర్పాటుచేసిన కార్గిల్ వార్ మెమోరియల్‌ను సందర్శించారు. మరోసారి కార్గిల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సైనిక, పారామిలిటరీ దళాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయని స్పష్టం చేశారు. ఈ నెల 20న మొదలైన విజయ్‌దివస్ కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. కార్గిల్ వీర సైనికులను స్మరించుకుంటూ ఢిల్లీ స్ట్రీట్ ఆర్ట్ గ్రాఫిటీ కళాకారులు.. ఆర్మీకి చెందిన పాత వాహనాలను కళాఖండలుగా మార్చారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అనుష్కాశర్మ తదితరులు కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.





No comments:

Post a Comment

Post Top Ad