జార్ఖండ్ : పాఠశాల అంటే ప్రపంచంలో ఎక్కడయినా విద్యార్థులకు మంచి చదువు చెప్పి భావి పౌరులుగా ఉత్తమ జీవితం గడిపేందుకు శిక్షణ ఇస్తారు. కానీ ఆ స్కూల్లో మాత్రం దొంగతనాలు ఎలాచేయాలి అని నేర్పిస్తారు. జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోగల సాహెబ్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఆ స్కూలు చిన్నపిల్లలకు దొంగతనం నేర్పించటమే కాదు, ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు ఒక్కో విద్యార్థికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ నేర్పించే దొంగతనం విద్యలో ప్రత్యేక కోర్సు కూడా ఉంది. కేవలం ఖరీదైన సెల్‌ఫోన్లను దొంగిలించటం ఎలా? అనేదే ఆ ప్రత్యేక కోర్సు. ఏదో దోపిడీ కేసులో పాఠశాలపై దాడిచేసిన సుఖ్‌దేవ్‌నగర్ పోలీసులు ఈ స్కూలు ప్రత్యేకత తెల్సుకొని షాకయ్యారు. ఐదుగురు పాఠశాల నిర్వాహకులు, కొంతమంది చిన్నారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కూల్లో చదివే చిన్నారులంతా సాహెబ్‌గంజ్ ప్రాంతానికి చెందినవారని, సెల్‌ఫోన్ల మార్కెట్లో దొంగతనాలు చేయటంపై వారికి శిక్షణ ఇస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.
Post Top Ad
Your Ad Spot
Monday, 23 February 2015
జార్ఖండ్ స్కూల్లో చిన్నారులకు దొంగతనం ట్రైనింగ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment