కామెర్లు వ్యాధి కాదు. కొన్ని రకాల వ్యాధుల్లో కనిపించే ఒక లక్షణం మాత్రమే. వ్యాధి ఏదైనా, రక్తంలో బిలిరుబిన్ అనే పదార్థం మోతాదు పెర గడంతో కళ్లు, చర్మం, పచ్చబడే అవకాశముం టుంది. కామెర్లు రావడానికిగల కారణాలను మెడికల్ కారణాలు, సర్జికల్ కారణాలుగా విభజి స్తారు. మెడికల్ కారణాల్లో విష పదార్థాలు (ఉదా హరణకు పాముకాటు వంటివి) ఎర్ర రక్త కణా లను నాశనంచేయడం ముఖ్యమైనది. ఏ కారణం గానైనా, కాలేయం చెడిపోతే కామెర్లు సోకు తాయి. పై వ్యాధులను కొంతవరకూ మందుల ద్వారా తగ్గించవచ్చు. అందుకే దీనిని మెడికల్ జాండిస్ అని అంటారు.
సర్జికల్ జాండిస్
బిలిరుబిన్‌ను కలిగి ఉండే పైత్యరసం కాలే యంలో తయారవుతుంది. ఇది ప్రవహించే బైల్ డక్ట్స్ (గొట్టాలు లేదా నాళాలు) డుయోడినమ్ లోకి, పాంక్రియాటిక్ డక్ట్‌తో కలిసి తెరుచుకుం టాయి. ఈ జీర్ణ రసాలు జీర్ణ ప్రక్రియల ద్వారా ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతాయి.
మధ్యలో మరొక డక్ట్ ద్వారా ఈ పైత్యరసం పిత్తాశయంలోకి చేరి అక్కడ నిలువ ఉంటుంది. అయితే ఈ గొట్టాల్లో దేనిలోనైనా అడ్డంకులు ఏర్పడితే రక్తంలో బైల్ పిగ్మెంట్ మోతాదు పెరిగి, జాండిస్ సంభవిస్తుంది. దీనినే అబ్‌స్ట్రక్టివ్ లేదా సర్జికల్ జాండిస్ అని వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ గొట్టాలలో అడ్డంకులు ల్యూమెన్‌లో కాని, గొట్టాల తాలూకు గోడలలో కాని లేదా ఏ ఇతర కారణాలవల్లనైనా బైటినుంచి కలిగే వత్తిడి వలన ఏర్పడి కాని సంభవిస్తాయి. ల్యూమెన్‌లో ఏర్పడే ముఖ్య కారణాల్లో పిత్తాశయంలో, డక్ట్స్‌లోరాళ్లు ఏర్పడుతాయి. వీటిని గాల్ స్టోన్స్ అని వ్యవ హరిస్తాము. అలాగే పిత్తాశయంలో ఇన్‌ఫెక్షన్ సోకినా, పిత్తాశయం కేన్సర్‌కు గురైనా పైత్య రసం ప్రవహించడానికి ఆటకం ఏర్పడి జాండిస్ సంభవిస్తుంది.
లక్షణాలు
కడుపు నొప్పి అకస్మాత్తుగా, తీవ్రంగా ఏర్ప డటం అరుదు. వీటిలోనొప్పి తీవ్రత తగ్గుము ఖంతో ఉండి, వాంతులు కావచ్చు. నొప్పి కడుపు పై భాగంలో కేంద్రీకృతమై, వెన్నెముకకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ జాండిస్ క్రమంగా మూత్ర పిండాలపై ప్రభావం చూపి, మూత్ర పిండాలు వైఫల్యానికి కారణమవుతుంది.
చికిత్స
అడ్డంకి ఏర్పడటానికిగల కారణాలు, కాలే యంలో అడ్డంకి ఎక్కడ ఉందో తెలుసుకుని తరు వాత శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. గాల్ స్టోన్స్ (గాల్‌బ్లాడర్‌లో రాళ్లు) కారణమైతే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది.
ఒకవేళ కేన్సర్ కారణమైతే, దానిని కూడా రాడికల్ ఆపరేషన్ ద్వారా సరి చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో ఇటీవల బాగా ప్రాచు ర్యంలోకి వచ్చిన లాపరోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా వ్యాధిని నయం చేయవచ్చును.
డాక్టర్ వి. అశోక్‌కుమార్,
సర్జన్, హైదరాబాద్

No comments:
Post a Comment