ACME గ్రూప్ 80 మెగావాట్ల విద్యుత్‌ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నదని ప్రక్కటించారు. ఎసిఎంఇ 107 మిలియన్ డాలర్లను తెలంగాణలో పెట్టుబడి పెడుతోంద న్నారు. మొత్తం 502.5 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు సిద్ధంచేసామని 2017 నాటికి ACME సోలార్ 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. తొలివిడతగా తెలంగాణదక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ మండలితో ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే పదినెలల క్రితం ప్రారంభించారు. ఆర్థికపరమైన లావా దేవీలు, విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలను ఇటీవలే పూర్తి చేసుకుంది. కంపెనీ ఛైర్మన్ మనోజ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని చెప్పారు. గతనెలలోనే వంద మిలియన్ డాలర్ల ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం సాధించామని, 50 మిలియన్ డాలర్లు వంద మెగావాట్ల ప్రాజెక్టులకు వినియోగిస్తామని చెప్పారు. రాజస్థాన్‌లో ప్లాంట్ ఏర్పాటుకోసం తొలివిడతగా 34 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పారు. ఐఎఫ్‌సి సంస్థ కూడా తమకు 73.10 కోట్ల రుణపరపతి అందిం చిందని మధ్యప్రదేశ్‌లో 25 మెగావాట్ల సౌలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Post Top Ad
Your Ad Spot
Sunday, 16 November 2014
తెలంగాణలో ఎసిఎంఇ 80 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment