బ్యాక్టీరియో ఫేజ్' (Bacterio Phase) అనే నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించి 1969లో వైద్యశాస్త్రంలో నోబెల్ అందుకు న్నాడు.*
*▪️బల్యం-విద్యాబ్యాసం..*
*▪️జర్మనీలోని బెర్లిన్‌లో 1906 సెప్టెంబరు 4న విద్యావంతుల కుటుంబంలో పుట్టిన మాక్స్ డెల్‌బ్రక్‌కి చిన్నతనం నుంచే ఏదో సాధించాలనే తపన ఉండేది. తండ్రి బెర్లిన్ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్, ఓ రాజకీయ పత్రికకు సంపాదకు డు కావడం, తల్లి కుటుంబంలోని వారంతా వైద్యవృత్తికి చెందిన వారే కావడంతో బాగా చదువుకుని అందరి కంటే పెద్ద పేరు సాధించా లని ఉవ్విళ్లూరుతుండేవాడు. పద్దెనిమిదవ ఏట ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించిన అతడు డిగ్రీ తర్వాత 24 ఏళ్లకే పీహెచ్‌డీ సాధించాడు.*
*♦️ ఆపై ప్రముఖ శాస్త్రవేత్తలైన నీల్స్‌బోర్ తదితరుల సహచర్యంలో భౌతిక శాస్త్రం లో కాంతి పరిక్షేపం, ఉష్ణగతిక శాస్త్రం, క్వాంటం సిద్ధాంతం, స్టాటిస్టిక్స్ మెకానిక్స్‌లో పరిశోధన పత్రాలు వెలువరించాడు.*
*▪️పరిశోధనలు..*
*♦️సూక్ష్మజీవుల గురించి అవగాహన అంతగా లేని రోజుల్లో వాటి గురించి పరిశోధనలు చేసి* *సాధికారికమైన విషయాలను చాటి చెప్పిన శాస్త్రవేత్తగా మాక్స్‌డెల్‌బ్రక్ గుర్తింపు పొందారు*
*♦️పరస్తుతం ఎంతో ప్రాధాన్యత కలిగిన 'మాలిక్యులర్ బయాలజీ' శాస్త్రం ఏర్పడడా నికి దోహద పడిన వారిలో ముఖ్యుడైన ఈయన ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతిని అందుకున్నారు.*
*♦️జవశాస్త్రంలోని జన్యువుల (Genes) ప్రవర్తనకు, భౌతికశాస్త్రంలోని అణువుల (Molecules) ప్రవర్తనకు పోలికలు ఉన్నా యంటూ నీల్స్‌బోర్ ఇచ్చిన ఉపన్యాసానికి ప్రభావితుడైన డెల్‌బ్రక్ తన పరిశోధనలను జన్యుశాస్త్రం వైపు మళ్లించాడు. అయితే నాజీలు రాజ్యమేలుతున్న అప్పటి జర్మనీలో ఇమడలేక అమెరికా వలస వెళ్లాడు. ఒక పక్క విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా భౌతిక శాస్త్రం బోధిస్తూనే, జన్యుశాస్త్రంలో పరిశోధన లు కొనసాగించడం విశేషం.*
*♦️అందుకు ఫలితంగానే 'బ్యాక్టీరియో ఫేజ్' (Bacterio Phase) అనే నూతన అధ్యాయా న్ని ఆవిష్కరించి 1969లో వైద్యశాస్త్రంలో నోబెల్ అందుకున్నాడు.*
*♦️బయాక్టీరియో ఫేజ్ అంటే సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నాశనం చేసే ఒక రకమైన వైరస్. ఒక రకంగా ఇవి జీవాణు భక్షకాలు. బ్యాక్టీరియాను భక్షిస్తూనే ఈ వైరస్ అధిక సంఖ్యలో పునరుత్పత్తి చెందడాన్ని ప్రయోగాత్మకంగా చూపిం చాడు. ఈ పరిశోధన వైద్య రంగంలో విప్లవాన్ని సృష్టించింది.*
*♦️ఆపై సంవేదన శారీరక శాస్త్రం(సెన్సరీ ఫిజి యాలజీ) లో పరిశోధనలు, 'మాలిక్యులర్ జెనెటిక్ ఇన్‌స్టిట్యూట్' స్థాపనల ద్వారా డెల్‌బ్రక్ శాస్త్రలోకానికి ఎంతో సేవ చేశారు.*
No comments:
Post a Comment