ప్రపంచంలో అత్యంత బరువైన సైకిల్‌గా ప్రపంచ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కడానికి సుమారుగా 1000 కిలోలు బరువుండే విధంగా ఒక భారీ సైకిల్‌ను రూపొందించాడు. చక్రాల పరంగా చూస్తే దీనిని మించిన సైకిల్ మరోటి లేదనే చెప్పాలి.జర్మనీకు చెందిన ఫ్రాంక్ డోస్ 49 ఏళ్ల పెద్దాయన ఈ 1000 కిలోలు బరువున్న సైకిల్ ద్వారా గిన్నిస్ రికార్డును సాధించడానికి అధికారికంగా సుమారుగా 500 యార్డులకు తొక్కుతూ తీసుకెళ్లాడు.వినియోగంలో లేని ఇనుముతో సైకిల్ ఫ్రేమ్, చక్రాలు మరియు ఇతర విడి భాగాలను రూపొందించుకున్నాడు.
చెత్తతో రెండు భారీ చక్రాలను డిజైన్ చేసుకుని అన్నింటిని కలిపి సుమారుగా 940 కిలోలు వచ్చేట్లుగా సైకిల్‌ను డిజైన్ చేసాడు.అయితే దీని తర్వాత స్థానంలో 860 కిలోలతో రెండవ అత్యంత బరువైన సైకిల్‌గా బెల్జియన్‌కు చెందిన జెఫ్ పీటర్స్ రూపొందించిన సైకిల్ రికార్డుల్లో నిలిచింది.ఈ భారీ సైకిల్‌ను తయారు చేయడానికి ఫ్రాంక్ డోస్ సుమారుగా 3,500 పౌండ్లను వెచ్చించినట్లు తెలిసింది.వెనుక వైపు చక్రం తిరగడానికి పెడల్‌తో చైన్ ద్వారా వెనుక చక్రాన్ని అనుసంధానం చేశాడు మరియు ముందు వైపు చక్రాన్ని తిప్పడానికి కూడా చైన్ డ్రైవ్‌ను అందించాడు.Post Top Ad
Your Ad Spot
Wednesday, 7 September 2016
అతి పెద్ద సైకిల్‌గా గిన్నిస్ రికార్డు కోసం....
Tags
# Education News
Education News
Labels:
Education News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment