పెన్‍డ్రైవ్‌కు పాస్‍వర్డ్ సెట్ చేయటం ఎలా..? - TS TRT

Post Top Ad

Your Ad Spot

Sunday, 12 June 2016

పెన్‍డ్రైవ్‌కు పాస్‍వర్డ్ సెట్ చేయటం ఎలా..?


కంప్యూటర్ పరిజ్ఞానం పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి పెన్డ్రైవ్ సుపరిచితమే. పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్గా గుర్తింపుతెచ్చుకున్న ఈ రీరైటబుల్ పరికరం కీలక సమాచారాన్ని స్టోర్ చేయటంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. సులువుగా ఎక్కడికైన క్యారీ చేయవచ్చు. 2జీబి, 4జీబి, 8జీబి, 16జీబి,32జీబి, 64 జీబి.. ఇలా అనేక మెమరీ వర్షన్లలో ఈ యూఎస్బీ డ్రైవ్లు లభ్యమవుతున్నాయి.
పెన్డ్రైవ్లను ముఖ్యంగా డేటా ట్రాన్స్ఫర్కు ఉపయోగిస్తాం. ఏ విధమైన ప్రొటెక్షన్ లేకపోయినట్లయితే మన పెన్డ్రైవ్లోని సమాచారాన్ని ఇతరులు సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. పాస్వర్డ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా పెన్డ్రైవ్లోని డేటాను ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు.
పెన్డ్రైవ్కు పాస్వర్డ్ ప్రొటెక్షన్ను ఏర్పాటు చేసుకోగలిగే తీరైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది....
మొదటి పద్ధతి BitLock Encryption ద్వారా
పీసీలోని యూఎస్బీ డ్రైవ్లను ప్రొటెక్ట్ చేసేందకు విండోస్ అధికారికంగా అందిస్తోన్న మాన్యువల్ పద్ధతే BitLock Encryption. ఈ ప్రొటెక్షన్ను ఎంపిక చేసుకోవటం ద్వారా పెన్డ్రైవ్ను యూఎస్బీకి కనెక్ట్ చేసే ప్రతిసారి బిట్లాక్ కోడ్ను ఎంటర్ చేసి డ్రైవ్లోని డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది.
ఓవర్హీట్ అవుతోన్న ల్యాప్టాప్ను చల్లబరచటం ఎలా..?
పెన్డ్రైవ్కు బిట్లాక్ ఎన్క్రిప్షన్ను ఏర్పాటు చేయటం ఎలా..?
స్టెప్ 1: మీ పెన్డ్రైవ్ను ముందుగా కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
స్టెప్ 2: పెన్డ్రైవ్ కనెక్ట్ అయిన వెంటనే మైకంప్యూటర్స్లోకి వెళ్లి యూఎస్బీ డ్రైవ్ పై మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి.
స్టెప్ 3: ఇప్పుడు కనిపించే ఆప్షన్స్ మెనూలో Turn on BitLockrను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 4: ఇప్పుడు BitLock Encryption డ్రైవ్కు సంబంధించిన ప్రత్యేకమైన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ బాక్సులో 'use a password to unlock the drive' ఆప్షన్ను టిక్ చేయండి.
స్టెప్ 5: ఆ మెనూలో కనిపించే ఖాళీల్లో మీకు నచ్చిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: తరువాత కనిపించే మెనూలో save the recovery key to file అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ పాస్‍వర్డ్ను కంప్యూటర్లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.
స్టెప్ 7: next బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పెన్డ్రైవ్లోని పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి.
స్టెప్ 8: ఎన్క్రిప్సన్ పూర్తయ్యాక close బటన్ పై క్లిక్ చేయండి. పెన్‍డ్రైవ్ను తీసి మరలా పీసీకి కనెక్ట్ చెయ్యండి. ఇక పై మీరు, మీ పెన్డ్రైవ్ను ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా Password ఎంటర్ చేస్తేనే డ్రైవ్ ఓపెన్ అవుతుంది.
రెండవ పద్ధతి Wondershare USB Drive Encryption ద్వారా..
వండర్షేర్ యూఎస్బీ డ్రైవ్ ఎన్క్రిప్షన్ అనే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుని మీ పెన్డ్రైవ్కు పటిష్టమైన పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవచ్చు.
పెన్డ్రైవ్కు వండర్షేర్ యూఎస్బీ ఎన్క్రిప్షన్ను ఏర్పాటు చేయటం ఎలా..?
స్టెప్ 1 : ముందుగా వండర్షేర్ యూఎస్బీ ఎన్క్రిప్సన్ సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి.
స్టెప్ 2 : పీసీలో ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేయండి.
స్టెప్ 3 : యూఎస్బీ పెన్డ్రైవ్ను కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.
స్టెప్ 4 : వండర్షేర్ యూఎస్బీ డ్రైవ్ ఎన్క్రిప్సన్ మెనూలో మీరు ఎన్క్రిప్ట్ చేయదలచిన డ్రైవ్ను సెలక్ట్ చేసుకోండి.
స్టెప్ 5 : మీరు ఎంత డేటాను ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నారో అంతే వాల్యుమ్ను సెలక్ట్ చేసుకుని Install Button పై క్లిక్ చేయండి.
యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్లోడ్ చేసుకోవటం ఎలా..?
స్టెప్ 6 : ఇప్పుడు ఓపెన్ అయ్యే Account Information మెనూలో యూజర్ నేమ్, పాస్వర్డ్లను సెట్ చేసుకోండి.
స్టెప్ 7 : సెక్యూర్ ఏరియాను క్రియేట్ చేసేందుకు OK బటన్ పై క్లిక్ చేయండి.

No comments:

Post a Comment

Post Top Ad