కంప్యూటర్ గురించి మీకు తెలియని నిజాలు ! - TS TRT

Post Top Ad

Your Ad Spot

Tuesday, 1 March 2016

కంప్యూటర్ గురించి మీకు తెలియని నిజాలు !



ఫస్ట్ కంప్యూటర్ పేరేంటో ఎవరికైనా తెలుసా..పోనీ అది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా.. అలాగే ఫస్ట్ కంప్యూటర్ పోగ్రామ్ గురించి ఎవరికైనా తెలుసా..ఫస్ట్ జనరల్ కంప్యూటర్ ఏంటో తెలుసా..ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు..అయినప్పటికీ కంప్యూటర్‌ను మనం వాడేస్తుంటాం...అయితే కంప్యూటర్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలను మీ ముందుకు తెస్తున్నాం. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
Read more: దిమ్మతిరిగే షాక్: ఒక్క ఏడాదే 13 గూగుల్ ప్రొడక్ట్స్ షట్‌డౌన్
ఫస్ట్ కంప్యూటర్ పేరు - ఢిఫరెన్స్ ఇంజిన్ ( 1821)
గణితానికి సంబంధించిన టేబుల్స్ కోసం ఫస్ట్ కంప్యూటర్ ని ఉపయోగించారు.
దీన్ని బ్రిటీష్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. చార్లెస్ బాబేజ్ ని పాదర్ ఆఫ్ కంప్యూటర్ గా చెబుతుంటారు. అయితే దీన్ని తయారుచేయడానికి బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ అది పూర్తి కాలేదు.
ఫస్ట్ జనరల్ పరపస్ కంప్యూటర్ - ఎనాలటికల్ ఇంజిన్ (1834)
పంచింగ్ కార్డ్స్ కోసం ఈ కంప్యూటర్ ని తొలిసారిగా వాడారు.అయితే ఇది ఇప్పటికీ పూర్తికాక అలాగే మరుగనపడిపోయింది
ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్
ఆల్గారిధమ్ టూ కంప్యూట్ బెర్నౌలి నంబర్స్ (1841 -1842). ప్రపంచంలోనే ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ లోవెల్స్ ఇటాలియన్ గణిత శాస్ర్తవేత్తకు సంబంధించిన రికార్డ్స్ ను ఎనలాటిక్స్ చేశారు. ఇదే ప్రస్ట్ ప్రోగ్రామ్ గా చరిత్రలో నిలిచింది.
ఫస్ట్ వర్కింగ్ కంప్యూటర్ - కంప్యూటర్ జడ్ 3 (1941)
కంప్యూటర్ల ఆవిష్కర్త కోనార్డ్ జూస్ కంప్యూటర్ జడ్ 1 మీద తొలిసారిగా పని చేశారు. అయితే అది కొద్ది నిమిషాలు మాత్రమే పనిచేసింది. ఇది జర్మన్ గవర్నమెంట్ కి సంబంధించిన అత్యంత సీక్రెట్ ప్రాజెక్ట్. జర్మన్ ఎయిర్ క్రాప్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో దీని మీద పనిచేశారు. అయితే దీనికి సంబంధించిన అసలైన మిషన్ 1943లో బెర్లిన్ లో జరిగిన బాంబు దాడిలో నాశనమయిపోయింది.
ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ -అటానాసోప్ -బెర్రీ కంప్యూటర్ ( ఎబిసి) (1942)
దీని తయారు చేసినవారు విన్సెంట్ అటానాసోప్ అండ్ క్లిఫోర్డ్ బెర్రీ. అందుకే ఇది వారిపేరు మీద ఎబిసి గా ప్రసిద్ధికెక్కింది. బైనరీలో వాడిన ఫస్ట్ కంప్యూటర్ ఇదే.ఎలక్ట్రానిక్ స్విచ్ లతో దీన్ని వాడారు. అయితే ఇది ప్రోగ్రామ్ బుల్ కంప్యూటర్ కాదు.
ఫస్ట్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్- క్లాసెస్- 1943
దీన్ని తయారు చేసిన వారు టామీ ప్లవర్స్. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో జర్మన్ సందేశాలను బ్రిటీష్ వారికి వ్యక్తపరచడానికి వాడారు. ఇది ఎలక్ట్రానిక్ స్విచ్ లతో అలాగే ప్లగ్ లతో పనిచేస్తుంది. ఈ కంప్యూటర్ క్రోడీకరించిన సందేశాల అర్థాలను వారం లోపల అందించేది.
మొదటి జనరల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ (1946)
యుఎస్ ఆర్మీ ఇచ్చిన నిధులతో యూనివర్సిటీ ఆఫ్ పెనిసెల్వేనియా వారు తొలిసారిగా ఈకంప్యూటర్ ని డెవలప్ చేశారు. ఇది 150 అడుగుల వెడల్పు గల క్లిష్టమైన ఆపరేషన్లను ఉపయోగించడానికి వాడారు. దీనికి కార్డ్ రీడర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదే ప్రపంచంలో తయారైన తొలి హైడ్రోజెన్ బాంబుకు సహాయం చేసింది.
ఫస్ట్ ట్రాక్ బాల్ ( 1946/1952)
1946లో మొదిటిసారిగా ఈ ట్రాక్ బాల్ వాడినా అది ప్రపంచానికి తెలయనివ్వలేదు.మిలిటరీ ఆపరేషన్స్ కోసం వాడారు. ఇక 1952లో టామ్ క్రాన్ స్టన్ ట్రాక్ బాల్ తయారు చేసారు. అది బంతి ఆకారంలో తయారుచేశారు.
ఫస్ట్ స్టోర్‌డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ( 1948)
ఫ్రెడిరిక్ విలియమ్స్ దీన్ని తయారు చేశారు. ఇదే ఫస్ట్ రాండామ్ యాక్సెస్ డిజిటల్ డివైస్ . స్టోరేజ్ పరంగా కూడా వాడుకోవచ్చు. ఇది మొత్తం 32 స్విచ్ లతో ఉంటుంది.
ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ( 1948)
ఇదే మొట్టమొదటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కొన్రాడ్ జూస్ 1943 నుండి ప్లాన్ కలుకి కోసం పని ప్రారంభించాడు. 1948లో ఇది పేపర్ లోకి ఇలా వచ్చింది. అయితే ఇది అంత ఆకర్షణీయంగా రాకపోవడంతో దీన్ని క్లోజ్ చేశారు.
ఫస్ట్ అసెంబుల్ ఆర్డర్ -ఇన్‌టియల్ ఆర్డర్స్ -1949
న్యూమరిక్ లో ఫస్ట్ ఆర్డరింగ్ ఇదే.సింబాలిక్ లో లెవల్ ప్రోగ్రామ్ కోడ్ అలాగే మిషన్ కోడ్ కూడా.
ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్ - సిమన్- 1950
నాలుగు ఆపరేషన్లతో తయారైన మొట్టమొదటి కంప్యూటర్ ఇది. అవి అడిషన్ ,నెగేషన్, గ్రేటర్ దేన్ ,అండ్ సెలక్షన్, పేపర్ టేప్ తో నడిచిన కంప్యూటర్.
ఫస్ట్ కంపెలర్ - A-0 for UNIVAC 1- 1952
గ్రేస్ హోపర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశారు. ఎ టూ 0 సిస్టంతో ప్రోగ్రామ్ ని తయారుచేశారు. తరువాత అది ఎ నుంచి 2కి మార్చి కష్టమర్ల కోసం రిలీజ్ చేశారు. ఇదే ఫస్ట్ ఒపెన్ సోర్స్ సాప్ట్‌వేర్
ఫస్ట్ ఆటోకోడ్- గ్లెనిన్ ఆటోకోడ్ - 1952
ఈ ఆటోకోడ్ హై లెవల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్స్ వారు తయారుచేశారు. దీన్ని గ్లెనిన్ అనే వ్యక్తి తయారుచేయడంతో ఆయన పేరుతోనే ఇది వాడుకలోకి వచ్చింది.
ఫస్ట్ రియల్ టైమ్ గ్రాఫిక్స్ డిస్ ప్లే కంప్యూటర్ - 1951
దీని పేరు AN/FSQ-7 .దీన్ని ఐబీఎమ్ తయారుచేసింది. ఇదే ఫస్ట్ రియల్ టైమ్ అవుట్ పుట్ ని అందిచింది. యుఎస్ ఎయిర్ ఢిపెన్స్ కోసం దీన్ని వాడారు. దీని ఆదారంగా గన్ తో సెలక్టడ్ ప్లేస్ ని టార్గెట్ చేయవచ్చు.
ఫస్ట్ హై లెవల్ ప్రోగ్రామింగ్ - 1957
దీని పేరు పోర్టాన్ .ఎక్కువస్థాయిలో ప్రోగ్రామింగ్ వాడినది ఇందులోనే.జాన్ దీన్ని తయారుచేశారు.
ఫస్ట్ మౌస్- 1964
దీని తయారుచేసిన వారు డగ్లస్. చిన్న చక్రాలతో నడిచే విధంగా తయారుచేశారు. ఈ చక్రాలతో కర్సర్ పాయింట్ ని స్క్రీన్ మీదకి కావలిసిన చోటుకి తీసుకెళ్లవచ్చు.
ఫస్ట్ కమర్షియల్ డెస్క్ టాప్ - ప్రోగ్రామా 101 ( 1965)
ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ పీసీ ఇది. అన్నీ పనులు దీనిలో చేసే విధంగా రూపొందించారు. దీని ధర 3,200 డాలర్లు.44000 యూనిట్లు అమ్మారు. ఇటాలియన్ ఉత్పత్తి తయారుదారు ఒలివెట్టి దీన్ని తయారుచేసింది.
ఫస్ట్ టచ్ స్క్రీన్ - 1965
ఫస్ట్ టచ్ స్క్రీన్ కంప్యూటర్ ని యుకెలో రూపొందించారు. 1990లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోసం దీన్ని ఉపయోగించారు. ఇందులో సింగిల్ పాయింట్ ఆప్ కాంటాక్ట్ మాత్రమే రిజిస్టర్ అవుతుంది.
ఫస్ట్ ఆబ్టెక్టివ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్-సిములా ( 1967)
క్లాసెస్ అండ్ సబ్ క్లాసెస్ కి సంబంధించిన లాంగ్వేజ్ ఇది.




No comments:

Post a Comment

Post Top Ad