ఓ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్ళగోరే అధికారులు తమకు ఎయిడ్స్ గానీ, ఇతర జబ్బులు గానీ లేవని రుజువు చేసే మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. దేశ సంపద- ఆర్థికాభివృద్ది అనే అంశంపై ఆ దేశంలో నెలరోజులపాటు (నవంబర్ 2నుంచి 30వ తేదీ వరకు) శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి అటెండ్ అయ్యే సీనియర్ అధికారులు ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలని సిబ్బంది శాఖ తన తాజా సర్క్యులర్‌లో ఆదేశించింది. వాళ్ళు తమ దరఖాస్తులతో బాటు వీటిని కూడా జత చేయాలట.. ఓ పరాయి దేశంలో శిక్షణకు హాజరయ్యేందుకు మానసికంగా, శారీరకంగా తాము అన్ని విధాలా అర్హులమని డాక్టర్ల నుంచి ధ్రువ పత్రాలు తేవాలని, పైగా ఇంగ్లీష్ పై కమాండ్, వాగ్ధాటి, మంచి ఆరోగ్యం ఉండాలని ఆ సర్క్యులర్ లో పీర్కొన్నారు. ఇలాంటి వారికి విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వెసులుబాటు, హెల్త్ ఇన్సూరెన్స్, డైలీ అలవెన్స్ తదితర ప్రయోజనాలన్నీ కల్పిస్తున్నారు.
Post Top Ad
Your Ad Spot
Tuesday, 20 October 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment