కిచెన్‌లో ప్రెషర్ కుకర్‌లు పేలి చాలామంది గాయపడడమో, ఒక్కోసారి మరణించడమో నేచురల్. ఇక వంటిల్లు ధ్వంసం కూడా అవుతుంది. ముఖ్యంగా పాత ప్రెషర్ కుకర్లు పేలిపోతుంటాయి. కుకర్‌లోని వేడి నీటి ఆవిరి వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంటుంది. దానిని బయటకు వదిలివేసేందుకు ఈ కుకర్లలో వాల్వ్‌లు వుండేవి కావు. స్టవ్ నుంచి కుకర్‌ను సకాలంలో తీసివేయకపోతే లిడ్ ఒక్కసారిగా ఎగిరిపోయి కుకర్‌లోని వేడి పదార్థాలు బయటపడతాయి. ఇవి దగ్గరలో వున్నవారి శరీరం మీద పడి ఒళ్లు బొబ్బలెక్కుతాయి. అయితే ఇటీవల తయారవుతున్న ప్రెషర్ కుకర్స్‌లో నీటి ఆవిరి ఒత్తిడిని తట్టుకునేందుకు వాల్వ్‌లు అమర్చుతున్నారు. పైగా ఎమర్జన్సీ రెగ్యులేటర్స్ కూడా వుంటున్నాయి. (దీంతో కొంతవరకు ప్రమాదాలు తగ్గుతున్నాయి). అలాగే కుకర్ లోపలి ప్రెషర్ విడుదలయ్యేవరకు లిడ్ లాక్స్ ఓపెన్ కాని రీతిలో వీటిని తయారు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కుకింగ్‌కు ముందు.. కుకర్‌కు అమర్చే రబ్బర్ గాస్కెట్ సరిగ్గా వుందో లేదో చూసుకోవాలి. అది పగుళ్లు వచ్చినా.. లోపభూయిష్టంగా వున్నా వాడరాదని చెబుతున్నారు. ఇక ప్రెషర్ కుకర్‌ను పూర్తిగా ఆహారపదార్థాలతో భర్తీ చేయరాదు. అలాగే నూనెను కూడా ఎక్కువ మోతాదులో వాడడం మంచిది కాదు. ఆయిల్ ఎక్కువగా వున్నపక్షంలో అది రబ్బర్ గాస్కెట్‌ను, ఇతర భాగాలను కరిగించివేసే ప్రమాదం వుంది. స్టవ్ నుంచి కుకర్‌ని తీసేశాక నీటి ఆవిరంతా విడుదలయ్యేలా చూడాలని, చల్లని నీటిని పోయరాదని నిపుణులు సూచిస్తున్నారు. కుకర్‌కు అతి దగ్గరగా వుండడం మంచిది కాదట! ఉష్ణోగ్రత 212 డిగ్రీల బదులు సాధారణ ఉష్ణోగ్రత వుండేలా చూసుకోవాలి. కుకర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మంచిదని అంటున్నారు. దాన్ని ఏదో ఒక చోట గాలి చొరబడని చోట వుంచే బదులు, లిడ్ పై భాగం కిందకు వుండేలా స్టోర్ చేయాలని సూచిస్తున్నారు. నాగపూర్‌లో ఇటీవల ప్రెషర్ కుకర్ హఠాత్తుగా పేలిపోయి దాని విజిల్ ఓ గృహిణి గొంతుభాగంలో చొచ్చుకుపోయింది. ఇలాంటి ప్రమాదాల్లో కొందరు తీవ్రంగా గాయపడి కిచెన్ అంతా ధ్వంసమైన సంఘటనలు వున్నాయి. అందువల్ల కుకర్ ఉపయోగించే ముందు బీ-అలర్ట్ అంటున్నారు.
Post Top Ad
Your Ad Spot
Tuesday, 20 October 2015
ఇది ప్రెషర్ కుకర్.. బీ అలర్ట్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment