అక్షాంశాలు - రేఖాంశాలు - TS TRT

Post Top Ad

Your Ad Spot

Wednesday, 29 July 2015

అక్షాంశాలు - రేఖాంశాలు




1. ఉత్తర, దక్షిణ ధృవాలకు సమాన దూరంలో భూగోళంపై గీసిన వృత్తం పేరు?జ. భూమధ్యరేఖ

2. 0° అక్షాంశం అని దేనిని అంటారు?జ. భూమధ్యరేఖ

3. భూమధ్యరేఖకు సమాంతరంగా ఉత్తర, దక్షిణ ధృవాల వరకు గీసిన వలయాకార ఊహారేఖలు?జ. అక్షాంశాలు

4. అక్షాంశాలను ఏ విధంగా పిలుస్తారు?జ. సమాంతర రేఖలు

5. అక్షాంశాల్లో అతి పెద్ద వృత్తం?
జ. భూమధ్యరేఖ

6. మొత్తం అక్షాంశాల సంఖ్య?జ. 180

7. 23 1/2° ఉత్తర అక్షాంశ రేఖ?జ. కర్కటరేఖ

8. 23 1/2° దక్షిణ అక్షాంశ రేఖ?జ. మకరరేఖ

9. 66 1/2° ఉత్తర అక్షాంశ రేఖ?జ. ఆర్కిటిక్ వలయం

10. 66 1/2° దక్షిణ అక్షాంశరేఖ?జ. అంటార్కిటిక్ వలయం

11. 90° ఉత్తర అక్షాంశరేఖ?జ. ఉత్తర ధృవం

12. 90° దక్షిణ అక్షాంశ రేఖ?జ. దక్షిణ ధృవం

13. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖకు లంబంగా, భూమధ్యరేఖను ఖండిస్తూ భూమి చుట్టూ నిలువుగా గీసిన ఊహారేఖలు?జ. రేఖాంశాలు

14. మొత్తం రేఖాంశాల సంఖ్య?జ. 360

15. రేఖాంశాలకు మరో పేరు?జ. మధ్యాహ్న రేఖలు

16. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని ఎందుకు అంటారు?జ. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాలోనూ ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది. ఒకే సమయాన్ని సూచిస్తుంది.

17. రేఖాంశాల్లో ప్రారంభరేఖ?జ. 0° రేఖాంశం (లేక) గ్రీనిచ్‌రేఖ

18. ఇంగ్లండ్ దేశంలోని ఏ నది మీదుగా గ్రీనిచ్‌రేఖ వెళ్తుంది?జ. థేమ్స్

19. గ్రీనిచ్‌రేఖ నుంచి తూర్పుగా 180° రేఖాంశం వరకు ఉన్న అర్థగోళం?జ. పూర్వార్థ గోళం (లేక) తూర్పు అర్థగోళం

20. గ్రీనిచ్ రేఖ నుంచి పశ్చిమంగా 180° రేఖాంశం వరకు ఉన్న అర్థగోళం?జ. పశ్చిమార్థ గోళం

21. అక్షాంశాలు, రేఖాంశాల ఉమ్మడి ఉపయోగం?జ. ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవచ్చు

22. అక్షాంశాల వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటి?జ. ఒక ప్రదేశపు శీతోష్ణస్థితిని తెలుసుకోవచ్చు.

23. సూర్యకిరణాలు ఏ రేఖలను దాటి లంబంగా పడవు?జ. కర్కటరేఖ, మకరరేఖ

24. భూమధ్యరేఖ నుంచి ఉత్తరంగా కర్కటరేఖ వరకు, దక్షిణంగా మకరరేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?జ. అత్యుష్ణ మండలం

25. కర్కటరేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు, మకరరేఖ నుంచి అంటార్కిటిక్ వలయం వరకు ఉన్న ప్రాంతం?జ. సమ శీతోష్ణ మండలం

26. ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధృవం వరకు, అంటార్కిటిక్ వలయం నుంచి దక్షిణ ధృవం వరకు ఉన్న ప్రాంతం?జ. అతి శీతల ధృవ మండలం

27. రేఖాంశాల వల్ల ప్రధాన ఉపయోగం?జ. వివిధ ప్రదేశాల సమయాల్లోని తేడాలను తెలుసుకోవడం

28. ఒక డిగ్రీ రేఖాంశాన్ని దాటడానికి సూర్యుడికి పట్టే సమయం?జ. 4 నిమిషాలు

29. భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం వద్ద నిర్ణయించారు?జ. 82 1/2° తూర్పు రేఖాంశం
 Tags: Gk Bits, Geography Bits in Telugu, Telugu Geography Bits

No comments:

Post a Comment

Post Top Ad