ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు చేసుకొమ్మని ఉంది. మనం మొబైల్ నెంబరును నమోదు చేసిన తరువాత వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ సర్వరుకు కలుపబడుతున్నట్లు మనకు వివిధ రకాల స్టేటస్‌లను చూపించి ఒక కాళీ పాప్‌అప్ తెరవబడుతుంది. ఈ తతంగం అంతా నిజంగానే వీడియో కాలింగ్ వస్తున్నట్లుగానే మనల్ని నమ్మించే విధంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫోను నంబరును మరియు మన ఫోనులో ఉన్న సమాచారాన్ని దొంగిలించడానికి తయారుచేయబడిన ఒక స్పామ్ సందేశం మాత్రమే. దీని ద్వారా వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ రాదు. అది తెలియక చాలా మంది వారి సమాచారాన్ని అందించడమే కాకుండా ఈ సందేశాన్ని వివిధ గ్రూపులలోను మిత్రులతోను పంచుకోని వారిని కూడా ఈ స్పామ్ బారిన పడేస్తున్నారు. కనుక వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఈ స్పామ్ సందేశాన్ని షేర్ చేయకండి. ఈ స్పామ్ బారిన పడకుండా మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి.
Post Top Ad
Your Ad Spot
Monday, 1 June 2015
వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్
Tags
# Android
# Internet Tips
# NET
NET
Labels:
Android,
Internet Tips,
NET
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment