విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ఆన్‌లైన్ అడ్మిషన్ వ్యవస్థ(ఓఏఎస్)ను ప్రారంభించింది. ఈ ఆన్‌లైన్ వ్యవస్థను గురువారం ఇగ్నో తాత్కాలిక ఉప కులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇగ్నోలో వివిధ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవస్థ ద్వారా ఇక ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇగ్నోలోని 148 కోర్సులకు జూలై 2015 అడ్మిషన్ సెషన్‌లో ప్రవేశాలకు ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. ఇగ్నో వెబ్‌సైట్ (www.ignou.ac.in) ద్వారా ఆన్‌లైన్ ప్రవేశాలు పొందవచ్చని, పీజీ కోర్సులకు జూన్ 15 ఆఖరు తేదీ అని, ఆలస్య రుసుముతో జూన్ 30 వరకూ గడువుందని తెలిపారు.
Post Top Ad
Your Ad Spot
Thursday, 7 May 2015
ఇగ్నోలో ఇక ఆన్‌లైన్ అడ్మిషన్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment