కాంగ్రెస్ నాయకుల్లో ఉత్కంఠ సెలవుపై ఉన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలే చెబుతున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి రాహుల్ గాంధీ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ బడ్డెట్ సమావేశాలకు ఆయన సెలవు పెట్టారు. పార్టీ భవిష్యత్ గురించి, పార్టీలో తన భవిష్యత్ గురించి అంతర్మఽధనం చేసుకోవడానికే రాహుల్ గాంధీ సెలవు పెట్టారని ఇన్నాళ్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. రాహుల్ బుధవారం రాత్రిలోగా ఢిల్లీ చేరుకుంటారని, ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న కిషాన్ ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తోంది. మరోవైపు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించే విషయం ఆసక్తికరంగా మారింది
Post Top Ad
Your Ad Spot
Wednesday, 15 April 2015
నేడు రాహుల్ గాంధీ ఘర్ వాపసి.?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment