కఫం శ్వాసకోశ సంబంధిత వ్యాధికి చిహ్నం. గొంతుకు సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, జలుబు, క్షయ వంటి వ్యాధి గ్రస్తులలో ఆయా తీవ్రతను బట్టీ కఫం ఏర్పడుతుంది. దీంట్లో ఎక్కువ భాగం చీమిడి అని పిలిచే మ్యూకస్‌లా ఉంటుంది. లేదా ఊపిరితిత్తుల్లో వ్యాధి వచ్చినట్లయితే అందులో చాలా మేరకు చనిపోయిన లేదా సజీవంగా ఉన్న బ్యాక్టీరియా, నిర్జీవ తెల్ల రక్తకణాలు(చీము) ధ్వసమైన రక్తకణాలు ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కావన్నట్టే కఫాలన్నీ ఒకే రకమైనవి కావు. ఒకే లక్షణానికి చిహ్నలుకావు. కానీ కఫం మాత్రం ఏదో ఒక అనారోగ్యానికి మాత్రం సూచిక. అందుకే డాక్టర్లు కఫ పరీక్ష చేసి దానికిగల కారణాల్ని తెలుసుకొని తగు విధమైన చికిత్స చేపడతారు. కఫం రాకుండా ఉండాలంటే ఆరోగ్యసూత్రాల్ని, ఆహార నియమాల్ని పాటించడం, కాలుష్యానికి దూరంగా ఉండడమే.
Post Top Ad
Your Ad Spot
Monday, 9 March 2015
కఫం ఎందుకు.. వస్తుంది?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment