బీహార్ రాజకీయాలకు తెరపడింది. తిరిగి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాష్ట్రానికి ఆయన సిఎం కావడం ఇది నాలుగోసారి. నితీశ్ తన మంత్రివర్గాన్ని ఒకే మారు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు 22 మంది మంత్రులుగా కొలువుదీరారు. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి సిఎంతో సహా అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో 20 మంది గతంలో నితీశ్ కేబినెట్‌లోనూ, ఆ తరువాత మాంఝీ కేబినెట్‌లోనూ కొనసాగారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు వీరిలో 18 మంది నితీశ్‌కు మద్దతుగా పదవులకు రాజీనామాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులెవరూ పాల్గొనలేదు. ఆసాంతం జనతా పరివార్ నేతల సందడి కనిపించింది. ఈ కార్యక్రమానికి లాలూ ప్రసాద్ యాదవ్, హెచ్‌డీ దేవెగౌడ, అఖిలేశ్ యాదవ్, అభయ్ చౌతాలాలతోపాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్(కాంగ్రెస్) కార్యక్రమానికి హాజరు అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరముందని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను మమత, అఖిలేష్, గొగోయ్‌తోపాటు ఇతర నేతలు సమర్థించారు. కాగా, సీఎం నితీశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. నితీశ్ ప్రమాణస్వీకారోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి మాంఝీ పాల్గొనడం కొసమెరుపు
Post Top Ad
Your Ad Spot
Sunday, 22 February 2015
బీహార్ ముఖ్యమంత్రిగా కొలువుదీరిన నితీశ్.. ఇది నాలుగోసారి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment