వికలాంగ విద్యార్థుల కోసం 2500 స్కాలర్‌షిప్‌లు - TS TRT

Post Top Ad

Your Ad Spot

Saturday, 31 January 2015

వికలాంగ విద్యార్థుల కోసం 2500 స్కాలర్‌షిప్‌లు

నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేయూత‌
వికలాంగ విద్యార్థుల ఉన్నత విద్య, ప్రొఫెషనల్ విద్య కోసం భార‌త ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు, స్కీమ్‌ల ద్వారా సహాయం అందిస్తున్నాయి. వీటిలో భాగంగానే ''నేషనల్ హ్యాండీక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్'' అర్హులైన వికలాంగ విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ల‌ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర వికలాంగ సంక్షేమ శాఖ వీటిని అందిస్తుంది.
స్కాలర్‌షిప్ స్కీమ్ (ట్రస్ట్ ఫండ్):
ఈ స్కీమ్ పరిధిలో 2500 స్కాలర్‌షిప్‌ల‌ను ఇస్తారు. గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ, పీజీ స్థాయి ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చదువుతున్న వారు వీటికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేవారికి మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.2500, పీజీ విద్యార్థులకు నెలకు రూ.3000 చొప్పున ప‌ది నెల‌ల‌పాటు చెల్లిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న డిగ్రీ విద్యార్థులకు పుస్తకాలు, ఇత‌ర ఖ‌ర్చుల‌ కింద ఏడాదికి రూ.6000, పీజీ విద్యార్థులకు అయితే రూ.10,000 చెల్లిస్తారు. వికలాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద స్కాలర్‌షిప్‌ పొందాలనుకునే వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకూడ‌దు. ఈ ప‌థ‌కం కింద స్కాలర్‌షిప్‌ పొందగోరేవారు ఇతర స్కాలర్‌షిప్‌లు తీసుకోకూడదు. మొత్తం 2500 స్కాల‌ర్‌షిప్‌ల‌లో మ‌హిళల‌కు 30 శాతం అంటే 750 స్కాలర్‌షిప్‌ల‌ను కేటాయించారు. ఒకవేళ మ‌హిళా విద్యార్థులు లేని పక్షంలో వీటిని పురుష విద్యార్థుల‌కు ఇస్తారు.
ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి ....
స్కాల‌ర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కాపీని ప్రింట్ తీసి విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ హెడ్‌తో సంత‌కం చేయించాలి. ఆ కాపీకి అవ‌స‌ర‌మైన సర్టిఫికెట్ కాపీల‌ను జతచేసి సంబంధిత చిరునామాకు నిర్ణీత గ‌డువులోగా పంపాలి.
చిరునామా: National Handicapped Finance and Development Corporation (NHFDC)
Red Cross Bhawan, Sector-12,
Faridabad - 121 007.
Online Registration http://www.nhfdc.nic.in/Registration_Form.aspx
Notification
Website: http://www.nhfdc.nic.in/default.aspx

No comments:

Post a Comment

Post Top Ad