నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అత్యున్నత భారతరత్న పురస్కారం ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించిందట. అయితే మాలవ్యా, వాజ్‌పేయిలతో పాటు నేతాజీకి ఆ మహోన్నత పురస్కారాన్ని అందిస్తే.. నేతాజీ తరపున స్వీకరించే వారు లేక కేంద్రం వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. 1945 ఆగస్ట్‌లో అదృశ్యమైన ఆయన మరణించాడనటానికి సాక్ష్యాలు లేవు. అలాగని బతికే ఉన్నాడని చెప్పేందుకూ నిదర్శనం లేదు. నేతాజీ ఎక్కడో జీవించే ఉన్నారని, ఏదో ఒక రోజు తిరిగి వస్తారని నేతాజీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ నమ్ముతున్నారు. బతికున్న వ్యక్తి పురస్కారాన్ని నేతాజీ తరపున ఎలా స్వీకరిస్తామని వారు ప్రశ్నించడమే ప్రభుత్వం వెనక్కు తగ్గటానికి కారణమని సమాచారం. కాగా నేతాజీ బతికే వున్నారని... ఆయన్ని కోర్టు ముందు హాజరు పరుస్తామని ఓ పిటిషనర్ కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం నేతాజీ అందజేయడంపై వెనక్కి తగ్గడం గమనార్హం.
Post Top Ad
Your Ad Spot
Saturday, 27 December 2014
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు భారతరత్న.. ఎవరు తీసుకుంటారు?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment