బోధన వృత్తికాదు.. జీవన విధానం - TS TRT

Post Top Ad

Your Ad Spot

Thursday, 4 September 2014

బోధన వృత్తికాదు.. జీవన విధానం


-"కాలం కంటే గురువు రెండడుగులు ముందే ఉండాలి -ప్రపంచ గమనాన్ని అర్థం చేసుకోవాలి "
-"విద్యాబోధన అనేది కేవలం వృత్తిమాత్రమే కాదని, అది జీవన విధానమని" - ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విద్యార్థులను సమర్థులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంభవిస్తున్న మార్పులను సునిశితంగా గమణించి, అర్థం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం జరుగనున్న నేపథ్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులకు ఎంపికైన 350మంది ఉపాధ్యాయులతో ప్రధాని గురువారం సమావేశమయ్యారు. ఉపాధ్యాయ వృత్తిపట్ల తన అభిప్రాయాలు, భావాలను వారితో పంచుకున్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయు డు తప్పకుండా కాలం కంటే రెండడుగులు ముందే ఉండా లి. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన సమయంలో నాకు రెండు ఆకాంక్షలుండేవి. నా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం, నా గురువులను సముచితంగా గౌరవించటం. ఆ రెండు ఆకాంక్షలను నేను నెరవేర్చుకున్నాను అని తెలిపారు. ప్రతీ విద్యార్థి జీవితంలోనూ గురువు పాత్ర అత్యంత ముఖ్యమైనదని, ఉపాధ్యాయుడికి పదవీ విరమణ అనేదే ఉండదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యావిధానంపై ఉపాధ్యాయులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరందరికీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందజేయనున్నారు. విద్యార్థుల జీవితాలను వెలిగించండి
By: Namasthe telangaana

No comments:

Post a Comment

Post Top Ad