వణికిస్తున్న ఎబోలా వైరస్ - TS TRT

Post Top Ad

Your Ad Spot

Thursday, 14 August 2014

వణికిస్తున్న ఎబోలా వైరస్

తెలుగువారు చదువుకునేందకు వీలుగా సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో తెలుగు ఖురాన్ దివ్య ఖురాన్‌కు చోటు కల్పించారు. దీనిని ప్రవాస భారతీయుడైన డాక్టర్ మౌలానా అబ్దుల్ రహీం అరబ్బీ నుంచి తెలుగులోకి అనువదించారు. - నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిడంతో 12 వేల ఇళ్లు కూలిపోగా, 400 మంది మరణించారు. - భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. దీంతో 1990 తర్వాత ఒక విదేశీ నేత నేపాల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్, ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా. పర్యటనలో భాగంగా మోడీ నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్ దేవాలయాన్ని సందర్శించారు. - మనిషికి అత్యంత ప్రమాధకరమైన వైరస్‌లలో ఒకటైన ఎబోలా వైరస్ బారినపడి పశ్చిమాఫ్రికాలోని సియెర్రా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో 950 మంది మరణించారు. ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఆయా దేశాలకు ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకులు తక్షణ సాయంగా రూ. 1500 కోట్లు ప్రకటించాయి. ఈ వైరస్ గబ్బిలాల (సహజ అతిదేయులు) ద్వారా జంతువులకు, జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తి 2 - 21 రోజుల వ్యవధిలో మరణిస్తాడు.

No comments:

Post a Comment

Post Top Ad