సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరం కాదట - TS TRT

Post Top Ad

Your Ad Spot

Thursday, 26 June 2014

సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరం కాదట

సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతున్నారు.ఇన్నాళ్లూ సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరమేనని అనుకున్నాం. దాంతో సెల్ టవర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. చాలా చోట్ల ఉన్న సెల్ టవర్లను కూడా పీకేశారు.

కానీ ఇప్పుడు ఒక నిపుణుల బృందం సెల్ టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించింది. సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కూడా ప్రమాదకరం కాదని ఆ నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ రేడియాలజిస్టు డా భావిన్ జాంఖరియా సెల్ రేడియేషన్ క్యాన్సర్ వ్యాధికి కారణం కాదని చెప్పారు. దాని వల్ల మనుషులపై ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని ఆయన అన్నారు. ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ కి అధ్యక్షులు కూడా. టాటా ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ కు  చెందిన డా. హోసూర్ కాస్త టెంపరేచర్ ని పెంచడం తప్ప సెల్ రేడియేషన్ ఎలాంటి అపకారమూ చేయదని తేల్చి చెప్పారు. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సెల్ రేడియేషన్ క్యాన్సర్ కారకం కాదని ప్రకటించింది. కాబట్టి సెల్ టవర్ల విషయంలోనూ, ఫోన్ల విషయంలోనూ కంగారు పడాల్సిన అవసరం లేదని వారంటున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad