జ్ఞాపకశక్తి భళా.. రికార్డులు కొట్టేలా! - TS TRT

Post Top Ad

Your Ad Spot

Thursday, 20 March 2014

జ్ఞాపకశక్తి భళా.. రికార్డులు కొట్టేలా!

9765433232566788909090099887766544332. ఈ అంకెను ఓసారి జాగ్రత్తగా గమనించండి. ఐదు నిమిషాలాగి చూడకుండా అదే వరుసలో చెప్పేయండి. అసాధ్యం కదూ! పదంకెల సెల్‌ఫోన్‌ నెంబరే గుర్తుండటం కష్టం. అలాంటిది ఇన్ని అంకెలా? అనుకుంటాం. యార్లగడ్డ సిస్టర్స్‌కి ఇలాంటివి తేలిక. 40, 50 అంకెల సంఖ్య అయినా ఒక్కసారి చూస్తే చాలు గర్తుపెట్టుకొని అలవోకగా చెప్పేస్తారు.అక్కాచెల్లెళ్లిద్దరూ మొదట్నుంచీ చురుకే. చెస్‌ ఆడేవారు. పెయింటింగ్స్‌ వేసేవారు. ఫొటోగ్రఫీ, థాయ్‌చీ మార్షల్‌ ఆర్ట్స్‌లో ముందే. ఎన్ని ఫోన్‌ నెంబర్త్లెనా తేలికగా గుర్తు పెట్టుకునేవారు. ఈ ప్రతిభకి మరింత సానబెట్టాలనుకున్నారు కన్నవాళ్లు. అప్పటి నేషనల్‌ మెమొరీ కౌన్సిల్‌ ఛైర్మన్‌ జయసింహని కలిశారు. జ్ఞాపకశక్తికీ పోటీలుంటాయనే విషయం తెలిసింది. ఆయన దగ్గర కేవలం వారం రోజులు శిక్షణ పొంది జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యారు. తొలి అడుగే పెద్ద విజయం. శ్రీవైష్ణవికి ఆరు, రమ్యశ్రీకి పద్నాలుగో స్థానం దక్కింది. రెట్టించిన ఉత్సాహంతో మరింత సీరియస్‌గా సాధన చేయడం మొదలుపెట్టారు. జాతీయస్థాయి పోటీల్లో టాప్‌ టెన్‌లో నిలిచిన వాళ్లకి అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఇస్తారు. ఆ రకంగా ప్రపంచస్థాయి పోటీలకు అర్హత సాధించారు. 2010లో వైష్ణవి జూనియర్స్‌ విభాగంలో తన అంతర్జాతీయ ప్రస్థానం మొదలుపెడితే, రమ్యశ్రీ సీనియర్‌గా బరిలోకి దిగింది. అప్పట్నుంచి వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రతిభ చూపుతూనే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.మెమొరీ ఛాంపియన్‌షిప్‌ పోటీలంటేనే క్లిష్టమైనవి. ప్రపంచస్థాయి పోటీలంటే మరింత కఠినంగా ఉంటాయ్‌. మొత్తం పదిరకాల పోటీలు దాటాలి. ప్రస్తుత 'వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌'ని వరల్డ్‌ మెమొరీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నిర్వహిస్తుంది. ఇందులో 45 దేశాలకు సభ్యత్వం ఉంది. 33 దేశాలు పోటీపడ్డాయి. మరో అభ్యర్థితోపాటు టాప్‌ 3 నిలిచి రమ్యశ్రీ, శ్రీవైష్ణవిలు ఇండియాని తొమ్మిదో స్థానంలో నిలిపారు. ఆ పోటీలివే.బైనరీ నెంబర్స్‌: ముప్ఫై అంకెల నెంబర్‌ ఇచ్చి పదిహేను నిమిషాల తర్వాత మళ్లీ అవే వరుస క్రమంలో రాసి చూపించమంటారు. స్పీడ్‌ వర్డ్స్‌: తక్కువ సమయంలో ఎక్కువ అంకెల్ని గుర్తించగలగాలి.నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌: వివిధ దేశాలకు చెందిన వ్యక్తుల ఫొటోలు, పేర్లు ఇస్తారు. పదిహేను నిమిషాల్లో ఎవరెక్కువందిని గుర్తిస్తే వాళ్లే విజేత. ఈ విభాగంలో రెండు ప్రపంచరికార్డులు సృష్టించింది శ్రీవైష్ణవి.చారిత్రక తేదీలు: అప్పటికప్పుడే కొన్ని సంఘటనలు, జరిగిన తేదీలు చెబుతారు. ఇచ్చిన సమయంలో వాటిని అప్పజెప్పాలి.అబ్‌స్ట్రాక్ట్‌ ఇమేజెస్‌: సరైన రూపంలేని కొన్ని బొమ్మలు చూపిస్తారు. వాటిని షఫిల్‌ చేసి ఇంతకుముందున్న వరుసక్రమం చెప్పమంటారు. ర్యాండమ్‌ నెంబర్లు: నలభై అంకెలున్న ముప్పై పేజీలిస్తారు. తర్వాత అవి ఏ క్రమంలో ఉన్నాయో గుర్తించగలగాలి.స్పోకెన్‌ నెంబర్లు: సెకనుకో నెంబర్‌ చొప్పున నాలుగువందల నెంబర్లు వినిపిస్తారు. 5 నిమిషాలయ్యాక ఆ క్రమాన్ని చెప్పాలి.స్పీడ్‌ కార్డ్స్‌: పేకాట ముక్కలు ఒకసారి చూపిస్తారు. ఆపై వాటిని కలిపేసి ఇంతకుముందు ఏ క్రమంలో ఉండేవో గుర్తించమంటారు.10ని. కార్డ్స్‌: పై పోటీలాంటిదే. రెట్టింపు సమయం పోటీ.జాతీయస్థాయిలోనూ ఇదే తరహా పోటీలుంటాయి. అత్యుత్తమ ప్రతిభ చూపిన ముగ్గుర్ని దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు గుర్తిస్తారు. ఓవరాల్‌ ర్యాంకు నిర్ణయిస్తారు. సాధన చేస్తే ఎవరైనా ఎవరైనా మెమొరీ ఛాంపియన్‌ కావొచ్చని అక్కాచెల్లెళ్ల సలహా. అందుకు వారు చెప్పే కిటుకులు.పెగ్‌ వర్డ్స్‌: ఒక్కో అంకెకు ఒక్కో రూపాన్ని వూహించుకోవాలి. అవి వస్తువులు, స్నేహితులు, నచ్చిన పదార్థాలు ఏవైనా కావొచ్చు. పోటీలో ఆ అంకె కనపడగానే ఆ రూపం మదిలో మెదిలేలా ప్రాక్టీస్‌ చేయాలి.క్రియేటివ్‌ మెథడ్‌: చిన్నప్పుడు చదివిన కథలు, జరిగిన సంఘటనల చుట్టూ ఓ కథ అల్లుకోవాలి. వాటిలోని పాత్రలు, వస్తువులను తేదీలు, సంవత్సరాలకు గుర్తులుగా పెట్టుకోవాలి.జర్నీ మెథడ్‌: మన చుట్టూ ఉన్న కొన్ని పరిసరాలు, వస్తువులు ఆటోమేటిగ్గా గుర్తుండిపోతాయి. ల్యాండ్‌ మార్కులను కొన్ని చిత్రాల రూపంలో గుర్తు పెట్టుకోవాలి. ఈ పద్ధతులకు తోడు యోగ, నడక, ధ్యానం, వ్యాయామం.. ఇలా ఏదో ఒక కసరత్తును దినచర్యలో భాగం చేసుకుంటే జ్ఞాపకశక్తిని ఒడిసిపట్టొచ్చు అంటున్నారు. అవార్డులందాయి..2010 వరల్డ్‌ జూనియర్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో శ్రీవైష్ణవికి బంగారు పతకం2012లో నేమ్స్‌ అండ్‌ ఫేసెస్‌ విభాగంలో శ్రీవైష్ణవి రెండు ప్రపంచరికార్డులు2012 వరల్డ్‌ మెమొరీ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన జట్టులో ఇద్దరూ సభ్యులు.జాతీయ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ 2013లో శ్రీరమ్యకి ఆరోస్థానంప్రపంచ మెమొరీ ఛాంపియన్‌షిప్‌ 2011, 2012లో ఐదు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్టులో సభ్యులు.

No comments:

Post a Comment

Post Top Ad