నీటిని పొదుపుచేయండి జనరల్ సైన్స్ - TS TRT

Post Top Ad

Your Ad Spot

Monday, 25 February 2013

నీటిని పొదుపుచేయండి జనరల్ సైన్స్


ప్రపంచంలో భారతదేశం అత్యధిక వర్షపాతం నమోదు చేసుకొని, రెండవ స్థానం పొందింది. అయినా నీటికొరతవుంది. నేడు నీటి పరిరక్షణ అనేది అత్యంత అవసరమైన విషయం. నీటి పరిరక్షణ వ్యక్తిగత స్థాయిలో నిజంగా ప్రారంభమవుతుంది. అందుచేత ఈ పరిరక్షణకు చాలా సరళమైన, చౌకగా అనుసరించే పద్ధతులను మన నిత్య కార్యక్రమాలలో అనుసరించొచ్చు. అయితే, ఇవి మన జీవన సరళిలో మార్పును తీసుకురాకుండా అనుసరించవచ్చును. క్రింది కొన్ని చిట్కాలను మీరు అనుసరించొచ్చు. ఇంటి కుళాయిని గట్టిగా బంధించండి., తక్షణం, లీకు అవుతున్న కుళాయిని స్థిరం చేయండి.నిత్యం, పైపులు మరియు టారులెట్లు అడుగుభాగం ఏమయినా లీకయినట్లయితే వెంటనే వాటిని మరమ్మత్తు చేయించండి. నీటిలో కొన్ని జతల ఇటుకలనుంచి నట్లయితే, దాని దానియొక్క సామర్థ్యాన్ని తగ్గించును. ఇది అమెరికాలో, వార్షికంగా ఇంటిల్లిపాది నీటివాడుక విషయంలో 3420 లీటర్ల నీటి వాడకాన్ని పొదుపు చేసినట్లే అని అంచనాలు తెలుపుతున్నాయి. మీ టారులెట్‌ ట్యాంకులలో ఏదయిన ''లీకు''వుందేమో తనిఖీ చేయండి. అందుకుగాను సిస్టర్న్‌లో ఆహారానికి రంగునిచ్చే పదార్థాన్ని స్వల్పంగా వేయండి. ఆ పాత్రలో రంగు క్రమేణా అదృశ్యమవుతున్నట్లయితే లీకు ఉన్నట్టే. కాబట్టి మరమ్మత్తు చేయండి. నీవు దంతాధావనం చేసినపుడు, చేతులను కడుగుకొనేటపుడు లేక తోముకొనేటపుడుగాని, కుళాయిని వదిలేయకండి. అపుడు గ్లాసు లేక పాత్రలో నీరు పోసి, దానితో నోటిని పుక్కిలించుటకు, గడ్డం శుభ్రం చేసేటపుడు లేదా దంతధావనం చేసినప్పుడుగాని పెట్టుకోండి.'షవర్‌'ను ఎప్పుడు ఉపయోగించవద్దు. స్నానానికి ఓ బకెట్‌ నీరు సరిపోతుంది. కూరగాయలు, పండ్లు, మాంసాలను ఓసారి పాత్రలో వేసి కడిగినాక, ఆ నీటిని మీ మొక్కలకు పోయండి. ఉడకబెట్టిన కూరగాయలు, అన్నం, పప్పుల నుండి వచ్చిన నీటిని తిరిగి ఉపయోగించుకోండి. దానిలో సమృద్దిగా పోషకాహార విటమిన్లు మరియు ఖనిజలవణాలుండుటచేత దానితో లాభాన్ని పొందవచ్చును.మీ వాహనాన్ని కడిగేటపుడు పైపుకు బకెట్‌, స్పాంజ్‌ల నుపయోగించండి. ఇలా వాడినట్లయితే 400 లీటర్ల నీరు ఖర్చుకాగా, బకెట్‌తో 300లీటర్లు నీరు పొదుపు అవుతుంది


1 comment:

  1. www.tollywoodpolitics.com

    www.bollywoodindiaboxoffice.com

    ReplyDelete

Post Top Ad