ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 ఖాళీలు - TS TRT

Post Top Ad

Your Ad Spot

Tuesday, 31 May 2016

ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 ఖాళీలు

ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 ఖాళీలు

బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాటిలైట్ సెంటర్ (ఐఎస్‌ఏసీ) టెక్నీషియన్-బి/ డ్రాట్స్‌మన్-బి/టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్/నర్స్-బి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Jobs 
టెక్నీషియన్ -బి: 120
విభాగాలు వారీ పోస్టులు: ఎలక్ట్రో-మెకానిక్/టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్/మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్/మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్-57; ఫిట్టర్-27; ఎలక్ట్రికల్- 14; ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్-4; ఎలక్ట్రోప్లేటింగ్-1; గ్రిండర్-3; ఫొటోగ్రాఫర్/డిజిటల్ ఫొటోగ్రాఫర్-2; కార్పెంటర్-2; డీజిల్ మెకానిక్-1; ప్లంబర్-4, టర్నర్-3.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ సర్టిఫికెట్ ఉండాలి.
డ్రాట్స్‌మన్-బి (6): మెకానికల్ 5; సివిల్ 1
అర్హత:
పదోతరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ సర్టిఫికెట్ ఉండాలి. క్యాడ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్: 33,
విభాగాలు:
మెకానికల్-13, ఎలక్ట్రానిక్స్-18, కంప్యూటర్‌సైన్స్-02, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)-3, లైబ్రరీ అసిస్టెంట్ -3, నర్స్-బి 1.
వయసు: 2016 జూన్ 17 నాటికి 18-35 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, నైపుణ్య పరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మే 28, 2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 17, 2016
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.isro.gov.in

No comments:

Post a Comment

Post Top Ad