గ్ని ప్రమాదాలు సంభవిస్తే రక్షణ కష్టమే తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధికారులకు లేఖ ఢిల్లీ, నవంబర్ 29: అత్యున్నత చట్టసభ... సర్వోన్నత న్యాయస్థానం.. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ రెండూ కాలిబూడిద కావల్సిందే. ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తులు, వందలాది మంది సిబ్బంది.. విలువైన గ్రంథాలు.. వేటికీ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేదు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించినా.. రక్షణకు తీసుకున్న చర్యలు లేవు. అదేమిటని ప్రశ్నిస్తే.. ''ఉన్నతాధికారులకు చెప్పాం.. అంతకంటే మేమేమీ చేయలేం..' ఇదీ సమాధానం. ఈ విషయాలన్నీ రోహిత్ సభర్‌వాల్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెల్లడయ్యాయి. అగ్నిమాపక దళ అధికారులు రోహిత్‌కు పూర్తి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడంతో కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ జోక్యం చేసుకుని వివరాలు రాబట్టారు. వచ్చిన వివరాలు చూసి కమిషనర్ విస్తుపోయారు. ప్రమాదం సంభవిస్తే.. సుప్రీం భవనంలోకి అగ్నిమాపక దళాలు వెళ్లేందుకు మార్గం లేదు. ఇరుకైన ప్రవేశద్వారం, కారిడార్‌ను ఆక్రమించిన అల్మారా లాకర్లు, పనిచేయని స్ర్పింక్లర్ బెల్, ఏసీ ప్లాంటుకు గ్ని ప్రమాదాలు సంభవిస్తే రక్షణ కష్టమే తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ అధికారులకు లేఖ ఢిల్లీ, నవంబర్ 29: అత్యున్నత చట్టసభ... సర్వోన్నత న్యాయస్థానం.. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఈ రెండూ కాలిబూడిద కావల్సిందే. ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తులు, వందలాది మంది సిబ్బంది.. విలువైన గ్రంథాలు.. వేటికీ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేదు. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించినా.. రక్షణకు తీసుకున్న చర్యలు లేవు. అదేమిటని ప్రశ్నిస్తే.. ''ఉన్నతాధికారులకు చెప్పాం.. అంతకంటే మేమేమీ చేయలేం..' ఇదీ సమాధానం. ఈ విషయాలన్నీ రోహిత్ సభర్‌వాల్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నతో వెల్లడయ్యాయి. అగ్నిమాపక దళ అధికారులు రోహిత్‌కు పూర్తి సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడంతో కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ జోక్యం చేసుకుని వివరాలు రాబట్టారు. వచ్చిన వివరాలు చూసి కమిషనర్ విస్తుపోయారు. ప్రమాదం సంభవిస్తే.. సుప్రీం భవనంలోకి అగ్నిమాపక దళాలు వెళ్లేందుకు మార్గం లేదు. ఇరుకైన ప్రవేశద్వారం, కారిడార్‌ను ఆక్రమించిన అల్మారా లాకర్లు, పనిచేయని స్ర్పింక్లర్ బెల్, ఏసీ ప్లాంటుకు స్ర్పింక్లర్ రక్షణ వంటివేమీ లేవు. ఇక పార్లమెంటు భవనం లోపలికి వెళ్లే దారులనూ అల్మారాలతో మూసేశారు. తాత్కాలిక కేబిన్లు కట్టారు. ఎమర్జెన్సీ లైట్లు పనిచేయడం లేదు. ఇలాంటి లోపాలు ఎన్నో ఉన్నాయి. వీటిపై సుప్రీం, పార్లమెంటు భవనాల ఉన్నతాధికారులను హెచ్చరించాలని కమిషనర్ శ్రీధర్ ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారులకు సూచించారు. వారు ఏమేరకు భద్రత చర్యలు తీసుకున్నారో నెల రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
Post Top Ad
Your Ad Spot
Sunday, 30 November 2014
పార్లమెంటు, సుప్రీం భవనాలకే భద్రత లేదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment