విద్యా విధానంలో భారతీయత ప్రతిబింబించాలి - TS TRT

Post Top Ad

Your Ad Spot

Sunday, 16 November 2014

విద్యా విధానంలో భారతీయత ప్రతిబింబించాలి

విద్య, నీరు, ఆరోగ్యం, విద్యుత్‌ మొదలైన ప్రాథమికావసరాలన్నీ సేవారంగాల పేరిట మొత్తం వ్యాపార వస్తువులుగా మారాయి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానమంతా ప్రపంచీకరణ ఫలితంగా మొత్తం ప్రజలందరికీకాక సామ్రాజ్యవాద కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది. విద్య ఆత్మజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని కలిగించాలి. దాంతోపాటు అది బతుకు తెరువుకు కూడా సాయపడితేనే సార్ధకం అవుతుంది. విద్యార్థులకు దైనందిన జీవితంలో ప్రత్యక్ష సంబంధంలేక పోవడం నేటి  విద్యా విధానంలోని ప్రముఖ లోపం. చదివిన విద్యతో ఏ విద్యార్థి ఉపాధి పొందలేదు. దొరికిన ఉద్యోగంలో తాను చదివిన చదువు ఉపయోగించడం లేదు.  తన పరిసరాలనూ, సంఘాన్ని గుర్తించి దానిని చక్కగా తీర్చిదిద్దినచో విద్య సార్ధకమవుతుంది. జాతి నిర్మాణ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేటట్లు విద్య దోహదపడాలి. చదువు బుద్ధి వికాసానికి, ఆత్మ సంస్కారానికి ముఖ్యమైంది. విద్య విజ్ఞానానికి వెలుగుబాట.

లక్ష్యాన్ని సాధించడమే చదవడంలో పరమార్థము. పరిపూర్ణమైన పౌరుడిగా వ్యక్తిగా ఎదగడానికి చదువు ప్రధాన మార్గం. చదువు వికాసాన్ని తెచ్చి పెట్టే పవిత్రమైన యజÑం వంటిది. నిరంతర పరిశ్రమతో జ్ఞానాన్ని సంపాదించి మానసిక పరిణతితో పరిపూర్ణమైన వ్యక్తిగా, పౌరుడిగా ఎదగడంచదువు దీర్ఘకాలిక లక్ష్యం. మానవుని విజ్ఞాన జ్యోతిగా తీర్చిదిద్దునది విద్య. ఈ విజ్ఞానం మానవుని నడవడికి, జీవితానికి బహుముఖంగా ఉపయోగపడేదిగా ఉంటుంది. విద్య లాభాలు సంపాదించే విధంగా రూపు చెందితే సమాజంలో అంతరాలు, వైరుధ్యాలు తీవ్రమవుతాయి. అసమానత పద్ధతుల్లో విద్యను పొందిన వారు సమానతను కాంక్షించరు. ధనమే మానవ సంబంధాలను నిర్ణయిస్తుంది. దేశ స్వావలంబన, స్వేచ్ఛ, న్యాయం, సమానత అనే విలువలు అర్థంగా జాతిని ప్రతిబింబించేలా విద్య ఉండాలి. విద్య పథకాలు, విధానాలు ప్రభువులు మారినా, మంత్రులు మారినా వారి మేథోసంపత్తికి,పరిమితికి తగిన రీతిగా ఆలోచించి వారికి నచ్చినతీరుగా విద్యావిధానాన్ని మార్పు చేస్తూ వస్తున్నారు. ఎపrడు విద్యావిధానం మారుతుందో మరల ఏ కొత్త పద్ధతి వస్తుందోననే ఆలోచన తప్ప లక్ష్యశుద్ధి లేకుండా పోతోంది. దేశ పారిశ్రామికాభివృద్ధికి ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యావిధానం అత్యవసరం. మనది వ్యవసాయక దేశం. మనదేశంలోని పాఠశాలల్లో వ్యవసాయాన్ని గూర్చిన పాఠ్యాంశాలు లేవు.

విద్యావంతుల వల్ల మనదేశానికి పట్టిన జాడ్యం వల్ల విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడటానికి ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాల్లో బీదవారికి విజ్ఞానం కన్నా ఉద్యోగంపై మక్కువ చూపుతున్నారు. మనది వ్యవసాయ దేశం కాబట్టి నూతన పరిశ్రమలు స్థాపిస్తున్నాం.వ్యవసాయాభివృద్ధికి, కుటీరపరిశ్రమల స్థాపనకు గల వనరులను దృష్టిలో ఉంచుకొని మన విద్యా విధానంలో మార్పులు చేయాలి. భావికాలంలో అవసరమైన వ్యక్తులకు శిక్షణావకాశాలు పెంపొందించే మార్గాలు ఉండాలి. సాంకేతిక విద్యాలయాల  సంఖ్యను కూడా తదనుగుణంగా పెంచాలి. విద్యావిధానంలో భారతీయత ప్రతి బింబించాలి. విద్యా విధానంలో భారతదేశ స్వరూపనముకు, అవసరాలకు తగిన విధంగా విద్యా ప్రణాళికా బోధనను మార్చవలసి ఉంది. జాతీయ అవసరాలకు అనుగుణమైన విధానముండాలి.

విద్యబోధనలో పరిశోధనలలోనే ప్రగతి. జాతీయా దాయంలో 10 శాతం నిధులు విద్యాబోధనల్లో పరిశోధనలకు కేటాయిస్తే అనేక ప్రయోగాలతో ఎంతో సాధించవచ్చు. సంప్రదాయ కోర్సుల స్థానంలో ఉద్యోగావకాశాలను మెరుగుపరిచే కోర్సులుగా సమూల మార్పులు చేయాలి. విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడే మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యతనివ్వాలి. పరిపాలన నిర్వహణలో పాలు పంచుకునే ఉపాధ్యాయులకు ప్రత్యేక స్కిల్‌్‌స కలిగి ఉండాలి. మనదేశానికి జీవనాడులైన వివిధ రంగాల పరిశ్రమలకు, వృత్తులకు తగినట్లుగా శిక్షణా సంస్థల్ని ఉన్నత పాఠశాల స్థాయిలో నెలకొల్పి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి. హైస్కూల్‌ స్థాయిలో వృత్తి విద్యను నిర్బంధ విషయంగా బోధించాలి. ఏదో ఒక సాంకేతిక విద్యను మామూలు విద్యతో జోడించి ప్రతి విద్యార్థి ఏదో ఒక విద్యలో నిష్ణాతుడయ్యే విధానం ఏర్పరచాలి. ఉన్నతస్థాయి విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి.

కాలానుగుణంగా విద్యారంగంలో కార్పొరేట్‌ విద్యతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానంలో మార్పులు తీసుకోవాలి. కాన్సెప్ట్‌ ఆధారిత, విశ్లేషణాత్మక విద్యాబోధన, ప్రతినెల స్కూల్‌ సెమినార్‌లు, పర్సనాలిటి డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక క్లాస్‌లు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఏకాగ్రతకు ఉపకరించేలా కౌన్సిలింగ్‌, మెడిటేషన్‌, యోగా క్లాసులు, పర్సనల్‌ ఫైల్స్‌తో ప్రతి స్లో లెర్నర్‌ ప్రగతిపై నిరంతర దృష్టి,విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలందు శిక్షణ, 3వ తరగతి నుండి ప్రాథమిక స్థాయి నుంచి కంప్యూటర్‌ శిక్షణ, ప్రతినెల విద్యార్థి ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలియచేయడం, అందుబాటులో రకరకాల పుస్తకాలతో చక్కని గ్రంథాలయం, నీతి బోధన, చిత్రలేఖనం, సంగీతం, వ్యాసరచన, వక్తృత్వంవంటి అంశాలకు ప్రాధాన్యత,వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు, 6వ తరగతి నుండి ఐఐటి వంటి పోటీపరీక్షలను దృష్టిలో పెట్టుకొని తర్ఫీదు నిర్వహించడం, అత్యంత ఆధునిక పరికరాలు, ఎల్‌సిడి, డిహెచ్‌పిలతో యానిమేషన్‌ దృశ్యాలతో అధునాతన విద్యాబోధన, స్టడీ, రీడింగ్‌ స్కిల్స్‌, స్పోకెన్‌ ఇంగ్లీష్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ, మానసిక ఒత్తిడిలేని ఆధునిక పద్ధతులలో విద్యాబోధన, ఎడ్యుకేషనల్‌ టూర్స్‌ ద్వారా విద్యార్థుల విజ్ఞానాన్ని,వినోదాన్ని పెంపొందించుట, సైన్స్‌లో విషయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయుటకు ప్రయోగ శాలలో కూడిన బోధన, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, మానసిక స్థైర్యం కోసం నిష్ణాతులతో కౌన్సిలింగ్‌, మోటీవేషనల్‌ క్లాసులు నిర్వహించడం, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు సకాలంలో స్కాలర్‌షిప్‌ సౌకర్యం అందించడం, విద్యాభ్యాస మునకే కాక విద్యాభ్యాసేతర కార్యక్రమాలకు సమాన ప్రాము ఖ్యత ఇవ్వడం, విద్యార్థి శారరీక, మానసిక ప్రోత్సాహానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఉండాలి. ప్రతి విద్యార్థికి విధిగా ఒక వృత్తి విద్యనేర్పటం,సృజనాత్మక శక్తిని వృద్ధిని చేయటం, విద్యార్థికిష్టమైన విద్యనేర్చుకొనే స్వేచ్ఛ నివ్వటం, పోటీల్లో నెగ్గగల విధంగా తీర్చిదిద్దటం కూడా అమలు జరిపితే చాలా మంచి ఫలితాలు రాగలవు. ఆధునిక ప్రసార సాధానల ప్రభావం విద్యారంగం మీద విస్తారంగా వ్యాప్తి చేయాలి. విద్యార్థి జ్ఞాపకశక్తిపై పరీక్ష జరపకుండా అతని సునిశిత మేధాశక్తిపై పరీక్ష జరగాలి.

విద్యార్జనకు అనువైన వాతావరణముండాలి. చీటికి,మాటికి పాఠ్య ప్రణాళికను, పాఠ్యగ్రంథాలను,పరీక్షా పద్ధతులను, నియమ నిబంధనలను మార్చడం వల్ల విద్యార్థుల్లో అసహనం, అసంతృప్తి చోటు చేసుకుంటుంది. పిల్లల్లో స్వంత శక్తి సామర్ధ్యాలు వెలికితీయడానికి మూడుగంటల పరీక్షల్లో హెచ్చు మార్కులు తెచ్చుకుంటేనే జీవితం బాగా ఉంటుందని నూరిపోయడమే ప్రస్తుత విద్యావిధానం లక్ష్యం.  విద్యార్థుల ఐ.క్యూ తప్ప ఇతర మేధోశక్తి సామర్ధ్యాలను మదింపు చేసే శక్తి ఇప్పటిపరీక్షా పద్ధతికి లేదు. జాతీయభావంపెంపొందించుకొని విద్యార్థులు విద్యా సమస్య లను చర్చించవలనేకాని రాజకీయ వ్యూహాల్లో చిక్కుకోరాదు. ఒక శాస్త్రవేత్త ఒక్కొక్క భావిపౌరుడు వేయి పరమాణువులకు సమానం అని అన్నారు.పిల్లలను నాడు పుట్టి అపrడపrడే పెరుగుతున్న దశలో ఇంటనున్న పిల్లలు అలవాట్లు చుట్టుపక్కల వారి అలవాట్లు పాఠశాలలు, కళాశాలలు ఆ పుట్టిన బాబును భావి భారత పౌరునిగా తీర్చిదిద్దే కార్యాలయాలై వర్తించాలి. అపrడే దేశ  సౌభాగ్యం మరింతగా వెల్లివిరుస్తుంది. విద్యను ప్రభుత్వాలు సామాజిక అంశంగా గుర్తించి అన్నిరంగాల కంటే విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

విద్యారంగం జాతి ప్రగతికి ఆయువు పట్టు అని గుర్తించిన నాడే విద్యకు విలువ పెరుగుతుంది. విద్యారంగం బాగుపడుతుంది. విద్య కోసం వెచ్చించిన ప్రతి రూపాయి భవిష్యత్తులో జాతి ప్రగతికి పెట్టుబడిగా తలంచాలి. విద్య కేవలం పుస్తకాలకు పరిమితం కారాదు. వారు తమ సంఘాన్ని, ప్రజల జీవన పరిస్థితులను, కష్ట సుఖాలను అర్ధం చేసుకోవాలి. పొరుగువారికి తోడ్పడుటకు సేవా దృష్టిని అలవర్చుకోవాలి

No comments:

Post a Comment

Post Top Ad